మనందరం ఆరోగ్యంగా ఉండేందుకు మంచి డైట్ ప్లాన్ ను పాటిస్తూ ఉంటాం. అయితే ఈ డైట్ లో ఉండే ఆహార పదార్థాల విషయంలో మాత్రం అంతగా జాగ్రత్తలు తీసుకోం. అందువలన మన శరీరంలో అన్ని భాగాలకు సకాలంలో పోషకాలను అందించలేం. అందుకోసమే ఇప్పుడు శరీరం మొత్తం పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంపొందించే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలు
మన శరీర ఆరోగ్యానికి పెంపొందించుకునేందుకు ఉపయోగపడే సూపర్‌ఫుడ్‌లో అవిసె గింజలకు విశిష్టమైన స్థానం ఉంది. మనలో చాలామంది వీటి సైజు చూసి మోసపోతాం. చిన్నగా ఉండే గోధుమకలర్ విత్తనాలు మనకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. వీటితో తయారుచేసే వంటకాలు చాలా రుచికరంగా కూడా ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధిక శాతంలో ఉండడంవలన శరీరంలో ప్రాకృతికంగా నూనె ఉత్పత్తి జరిగి శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. అధిక బరువును నియంత్రించేందుకు ఇది సరైన ఎంపిక. అంతేకాకుండా వీటిలో కొలైస్ట్రాల్ అస్సలు ఉండదు. అందువలన ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్. ఈరోజుల్లో మనందరిలో సాధారణంగా ఉండే హెయిర్‌లాస్ సమస్యను వీటితో అధిగమించవచ్చు. ఈ విత్తనాలు మన కుదుళ్ల ఆరోగ్యానిని పెంపొందించడంలో సహాయపడతాయి. థియామిన్ అనే బి విటమిన్‌ను అధక శాతంలో కలిగి ఉండడం వలన అవిసె గింజలు జీవక్రియను పెంపొందించి శరీరంలో సెల్ ఫంక్షన్ సక్రమంగా జరిగేలా చూస్తాయి.
కొబ్బరి
కొబ్బరినూనె అనేది అన్నీ సూఫర్‌ఫుడ్స్‌లో రాజులాంటిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మల్టీపర్పస్ ఫుడ్ అందించే పోషకాలు ఏ ఇతర సూపర్‌ఫుడ్‌లో మనకు లభించవు. దీనిలో కాపర్, సెలేనియం, ఐరెన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి పోషకాలు అధిక శాతంలో ఉంటాయి. అందువలన మన శరీరంలో జీవక్రియను సక్రమంగా చేసి మరియు రోగనిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిని వంటలు చేసేందుకు, అందం పెంపొందించుకునేందుకు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. చాలా బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్స్ తయారీలో ఖచ్చితంగా కొబ్బరినూనె ఉపయోగించబడుతుంది. ఈ నూనెను డైరెక్ట్‌గా మన శరీరానికి రాసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ కలగలసిన ఈ సూపర్‌ఫుడ్‌ని వెంటనే మీ డైట్‌లో చేర్చుకోండి.
క్వినోవా
శరీర అందాన్ని పెంపొందించే ఈ సూపర్‌ఫుడ్ మన చర్మానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో ఈ క్వినోవా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంపై ఏర్పడే మొటిమలు, వయస్సు మచ్చలను నివారించేందుకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా మొటిమలను నివారించే గుణం కలగిన సెబంను ఇది తయారుచేస్తుంది.
బొప్పాయి
నారింజ మరియు పసుపు రంగులో ఉండే ఈ బొప్పాయి పండును ఖచ్చితంగా మన డైట్‌లో ఉండాల్సిన సూపర్‌ఫుడ్. పాపయిన్ ను అధికశాతంలో కలిగిఉండే ఈ ఫలాన్ని స్కిన్ వైటనింగ్ మాస్క్, క్రీమ్స్ మరియు లోషన్‌ల తయారీలో ఉపయోగిస్తారు. బొప్పాయిలో అధికశాతంలో ఏ, సి మరియు ఈ విటమిన్లు ఉండడం వలన ఇది డయాబెటిక్ గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఫోలిక్ యాసిడ్ అమినో యాసిడ్ హోమోసిస్టైన్‌ను సాధారణ అమినో యాసిడ్‌గా మార్చేందుకు ఉపయోగపడుతుంది. మాంసాహారాలలో అధికంగా ఉండే ఈ హోమోసిస్టైన్ గుండె జబ్బులకు రావడానికి ప్రధాన కారణం. అందువలన బొప్పాయి తినడం వలన హోమోసిస్టైన్ లెవెను తగ్గించుకొని గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నుండి బయటపడవచ్చు. అసాధరణ రుతుక్రమం ఉండే మహిళలలకు బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఇది రుతుక్రమాన్ని మరలా సాధారణ స్థితికి తెచ్చేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా
అలోవెరా
కొబ్బరి లాగే అలోవెరా కూడా బహుళ ప్రయోజనాలు కలిగిన సూపర్‌ఫుడ్‌గా గుర్తించబడింది. వీటి నుండి వచ్చే జెల్ చాలా శ్రేష్టమైనది. చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలు మరియు వడదెబ్బ నివారణకు వాడే ప్రొడక్టుల తయారీలో ఈ జెల్ ఉపయోగించబడుతుంది. శరీర ఆకృతిని మెరుగుపరచేందుకు మరియు మన వయస్సును తక్కువ చూపించే సాధనంగా అలోవెరా జెల్ పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ తాగడం వలన మనం మలబద్ధకం మరియు గుండెల్లో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచేందుకు ఉపయోగపడే ఈ సూపర్‌ఫుడ్ మన జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు చాలా శ్రేష్టమైన నూనెగా పేరుతెచ్చుకుంది. ఇది రక్తంలో షుగర్‌లెవెల్స్‌ను ను కంట్రోల్‌చేసి శరీరంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరగకుండా చూస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజూ వాడటం గుండె, రొమ్ము మరియు జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆలివ్ ఆయిల్ రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. మరియు మన శరీర అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఇది సహజమైన హైడ్రేటింగ్ క్వాలిటీస్‌తోపాటు యాంటి ఏజింగ్ యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. జుట్టుకు మరియు గోళ్లకు డై కిట్‌లా మరియు లిప్ స్క్రబ్‌లా కూడా ఇది ఉపయోగపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. గుండె కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source: telugu.samayam