భారతదేశంలో చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. నేటి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది ఏర్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యాన్ని పాడుచేసే కొన్ని అలవాట్లని మార్చుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్ల వల్ల అసిడిటీ సమస్య తలెత్తుతుంది. అందులో మొదటగా టీ గురించి చెప్పుకోవాలి. మీరు టీని ఇష్టపడి ఉదయం పరగడుపున తాగితే ఎసిడిటీ, రిఫ్లక్స్ సమస్య తలెత్తుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే పిత్త రసంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఆమ్లత్వం, వికారం సమస్యలు ఏర్పడుతాయి. టీ మాత్రమే కాదు పరగడుపున తినకూడని చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిలో మసాలా వస్తువులు, వేడి కాఫీ, అధిక నూనె ఆహారం, చాక్లెట్ మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
పొద్దున్నే టీ లేకుండా ఉండలేకపోతే అందులో కొంచెం అల్లం కలుపుకుని తాగవచ్చు. దీంతో ఎసిడిటీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ను చేర్చండి. ఇది కడుపులో గ్యాస్ ను కలిగించదు. జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్లు తింటే పొట్ట సమస్యలు రావు. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి మీరు వీటిని ప్రతిరోజూ ఉదయం తినవచ్చు. అయితే ఎసిడిటీని నివారించడానికి ఎక్కువగా నూనెలో ఉడికించకూడదు. తిన్న తర్వాత కొంచెం దూరం నడిస్తే మంచిది. ఇది ఎసిడిటీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి. యోగ, ధ్యానం కూడా మంచిదే.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఎసిడిటీ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source: tv9telugu