ఏ నూనెతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి..?

మనమందరం మన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల (Food) వల్ల క్యాన్సర్ (Cancer) వస్తుందనే భయం ఉంది. ఏదేమైనా మనం ఏది తిన్నా అది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మనం ఏమి తింటున్నామో, అది మనకు ప్రయోజనకరమైనదా లేదా హానికరమా అనే విషయం గురించి మనకు తెలియదు. ఇలా తెలియకుండా తినడం వల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. ఇక ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ ని సకాలంలో గుర్తించకపోతే ఆ వ్యక్తి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. వైద్య నిపుణులు తెలిపిన వివరాలు. వివిధ పరిశోధనలు, విడుదలైన నివేదికల ప్రకారం..

క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నప్పటికీ, మనం వాడుతున్న వంటనూనె కూడా క్యాన్సర్ కు కారణమవుతుందని తెలుసుకోవాలి. క్యాన్సర్ కణాలకు కారణమయ్యే వంట నూనెలు ఏవో ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజుల్లో వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ నూనె మన శరీరంలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుందని, కాలేయం, జీర్ణ అల్సర్లు, ఊబకాయం, కొలెస్ట్రాల్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

ఏ నూనెలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ:

మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పామ్, సోయాబీన్ నూనెలు వేడి చేసినప్పుడు ఆల్డిహైడ్లు అనే రసాయనాలను విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రమాదకరమైనవి. ఇవి వివిధ క్యాన్సర్ లతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

నూనెతో క్యాన్సర్ ఎలా పెరుగుతుంది:

వాస్తవానికి నూనెలో పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వు అధిక పరిమాణంలో ఉంటుంది. ఏదైనా నూనెను వేడి చేసినప్పుడు అది ఆల్డిహైడ్ గా విచ్ఛిన్నమవుతుంది. దీని కారణంగా నూనెను వేడి చేసినప్పుడు వాసన వస్తుంది. ఈ నూనెలు తినడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

కూరగాయల నూనెలో క్యాన్సర్ కారకాలు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన రోజువారీ మొత్తం కంటే కూరగాయల నూనెలలో వేయించిన ఆహారంలో 200 రెట్లు ఎక్కువ ఆల్డిహైడ్ ఉందని డిమోన్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.

ఆలివ్ ఆయిల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

ఆలివ్ ఆయిల్ తక్కువ రిస్క్ ని కలిగి ఉందని పరిశోధనలో తేలింది. కొవ్వు, వెన్నలో ఆల్డిహైడ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. క్యాన్సర్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source: tv9telugu.com


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close