మధుమేహం, హైబీపీ, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడటం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆధునిక జీవనశైలి, సమయపాలన లేని ఆహారం, అధిక మద్యపానం వల్ల వీటి బారిన పడుతున్నారు. కాలేయం అనేది మన శరీరంలో అంతర్భాగం. ఇది పనిచేయకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది.
ఈ రోజుల్లో ప్రజలు ఫ్యాటీ లివర్ మాత్రమే కాదు లివర్ ఫెయిల్యూర్ సమస్యని కూడా ఎదుర్కొంటున్నారు. హెపటైటిస్ సమస్యలు ఉన్నవారికి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.18 ఏళ్లలోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.
లివర్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి..?
లివర్ ఫెయిల్యూర్ అంటే.. రోగి శరీరంలో కాలేయ కణాలు నెమ్మదిగా చనిపోవడం జరుగుతుంది. ఒక సమయంలో కాలేయం పనిచేయడం మానేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి మొదటిసారిగా సంభవిస్తుంది. అలాంటి సమయంలో బాధితుడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నిర్లక్ష్యం చేస్తే వెంటనే ప్రాణాలు పోతాయి.
దాని లక్షణాలు
కళ్ళు పసుపు రంగులోకి మారడం, ఉబ్బరం, వ్యాధి ముదిరితే రక్తంతో కూడిన వాంతులు, వికారం, శరీరంలో బలహీనత, శ్వాస ఆడకపోవడం, ఉదర సమస్యలు తలెత్తుతాయి.
తక్షణ చికిత్స: ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కొంచెం ఆలస్యమైనా ప్రాణాంతకం కావచ్చు. అలాగే డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటించడం చాలా ముఖ్యం.
ఆహారంలో మార్పు: చాలా సందర్భాలలో ఈ వ్యాధి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను చుట్టుముడుతుంది. కాబట్టి దీని కోసం ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. తినడమే కాకుండా చురుకుగా ఉండాలి. దీని కోసం వ్యాయామం చేయాలి. ఎక్కువ నీరు తాగాలని గుర్తుంచుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. లివర్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source: tv9telugu.com