ఈ పుడ్ తింటే.. మీ కిడ్నీలు సేఫ్..!

మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీకి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వచ్చినా.. మిగిలిన అవయవాల పైనా ప్రభావం పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. కిడ్నీ సమస్యలు వస్తే.. ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. అవేంటే తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ కిడ్నీలేశుద్ధి చేస్తాయి. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను ఫిల్టర్‌ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే.. ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి. లేకపోతే అవయవాలు పని చేయడం మానేసి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మారుతున్న జీవనశైలితో షుగర్‌, అధిక బరువు, హైబీపీతదితర సమస్యలు మూత్రపిండాల వ్యాధులకు దారి తీస్తున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30 శాతం, టైప్‌-2 మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీల సమస్యను ముందుగానే కనిపెట్టడం కాస్త కష్టమే. చాలా సందర్భాల్లో సమస్య తీవ్రమయ్యే వరకు లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్యలు వస్తే.. సాధారణంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చీలమండలు వాపు, పాదాల వాపు , చేతుల వాపు, అలసట, మూత్రంలో రక్తం, మూత్రవిసర్జనలో ఇబ్బంది, కండరాల తిమ్మిరి, చర్మంపై దురద వంటివి ఇబ్బంది పెడతాయి. ఇవి గమనించి మొదట్లోనే టెస్టులు చేయించుకుంటేనే మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తమ ఆహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం, పానీయాల విషయంలో కొన్ని మార్పులు చేస్తే.. మూత్రపిండాల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. కిడ్నీలు శుభ్రంగా, ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయని లవ్‌నీత్‌ అంటున్నారు. కిడ్నీ పేషెంట్స్‌ తీసుకోవాల్సి ఆహారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో లవ్‌నీత్ బాత్రా షేర్‌ చేసుకున్నారు..

కాలీఫ్లవర్‌

కిడ్ని సమస్యలను ఎదుర్కోవడానికి కాలీఫ్లవర్‌ సూపర్‌ ఫుడ్‌లా పని చేస్తుంది. ఫ్యాట్‌ ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సీకరణ తగ్గించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. శరీరంలో సోడియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటే.. కిడ్నీలలో ఎక్కువగా నీరు చేరి వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది. కాలీఫ్లవర్‌లో సోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మీ శరీరంలో నీటి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్‌లో తక్కువ ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్‌ క్లీన్‌ చేసి కిడ్నీలపై భారం పడకుండా చేస్తుంది. విటమిన్ సి, ఫోలేట్‌లు పష్కలంగా ఉంటాయి.. ఇవి మీ శరీరం టాక్సిన్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి

కిడ్నీ రోగులు వంటల్లో ఉప్పుకు బదులుగా వెల్లుల్లిని ఉపయోగిస్తే మంచిది. వెల్లుల్లి ఆహారం టేస్ట్‌ను పెంచడమే కాదు.. ఎన్నో పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో తక్కవ మొతాదులో సోడియం, పోటాషియం, పాస్పరస్ ఉండటం వల్ల వెల్లుల్లి కిడ్నీ పెషేంట్లకు చాలా వరకు మేలు చేస్తుంది. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లులి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో భాగంగా తిన్నా మంచిది. వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి మరియు విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

ఆపిల్‌

ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ఆపిల్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు ఇవి ఉపకరిస్తాయి. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆపిల్స్‌లో పొటాషియం, ఫాస్పరస్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీ పేషెంట్స్‌కు మంచి ఆప్షన్‌. కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఆపిల్ తినాలి.

రెడ్ క్యాప్సికమ్‌

రెడ్ క్యాప్సికమ్‌ కిడ్నీ పేషెంట్‌కు మంచి ఫుడ్‌. రెడ్‌ క్యాప్సికమ్‌లో పొటాషియం పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. రెడ్‌ క్యాప్సికమ్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి కిడ్నీ పని తీరును మెరుగుపరుస్తాయి.

స్ట్రాబెర్రీలు

వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేందుకు సహకరిస్తాయి.

ఓట్స్‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో ‘బీటా గ్లూకాన్’ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.

ఉల్లిపాయ

కిడ్నీ పేషెంట్లు సోడియం తక్కువగా ఉండే ఉల్లిపాయను తీసుకోవడం చాలా మంచిది. ఉప్పుకు బదులుగా ఉల్లిపాయలు ఉపయోగించినా మంచిదే. కిడ్ని పేషెంట్స్ ఉప్పుకు దూరంగా ఉంటేనే మంచిది. ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నీళ్లు తాగాలి..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంలే రోజు క్రమం తప్పకుండా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు కాకుండా రక్షిస్తుంది. కచ్చితంగా రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి. తద్వారా కిడ్నీలు ఆరోగ్యాం ఉంటాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.  కిడ్నీలు కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source: telugu.samayam


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close