ప్రస్తుతం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇంటికో మధుమేహం పేషెంట్ ఉంటున్నారు. రోజురోజుకు డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతియేటా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. వంశపార్యపరంగా గానూ, జీవనశైలి మార్పుల కారణంగా, అధిక ఒత్తిడి, టెన్షన్ ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మంది టైప్-2 డయాబెటిస్కు బలవుతున్నారు.
డయాబెటిస్ను ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అదపులో పెట్టుకోవచ్చు తప్ప.. పూర్తి స్థాయిలో నిర్మూలించలేము. అయితే చాలా మంది డయాబెటిస్ రాగానే అన్ని తినకూడదని అనుకుంటారు. పండ్లుకూడా తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని భయపడుతుంటారు. కానీ కొన్ని పండ్లను తీసుకోవడచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పదార్థాలను, పండ్లను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ (Sugar Levels)ను అదుపులో పెట్టుకోవచ్చు.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. బీన్స్, గింజలు, విత్తనాలు, చేపలు, సముద్రపు చేపలు, చికెన్, గుడ్లు, తక్కువ కొవ్వు కలిగిన వాటిని తీసుకోవడం మధుమేహం ఉన్నవారికి మంచివి. మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాలు, పౌష్టికాహార సమతుల్యం ఆహారంలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగు పర్చడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు, మధుమేహం సంరక్షణ నిపుణుడు సుజాత శర్మ తెలిపారు.
తృణధాన్యాలు: ఈ ధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్కు గొప్ప మూలం. షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకునేందుకు సహాయపడతాయి.
ఆకు కూరలు: వాటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఉసిరి ఆకులు, ఆకు కూరల్లో కార్పొహైడ్రేట్స్, కేలరీలు తక్కువగా ఉంటాయి. సలాడ్లు, సూప్లుగా భోజనంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి.
నట్స్: నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. బాదం, వాల్నట్ వంటి నట్స్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
చేపలు, చికెన్,గుడ్లు: చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటుంది. చికెన్, గుడ్లు, చేపలు, ప్రోటీన్లకు మంచి మూలం. ఇందులో కార్పోహైడ్రేట్లు కలిగి ఉంటాయి.
పెరుగు, కాటేజ్ చీజ్: అవి ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డికి మంచి మూలం. కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం బెటర్. పుదీనా మజ్జిగ ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.
బెర్రీలు వంటి తాజా పండ్లు: బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్గా పరిగణించబడతాయి. వాటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్, బెర్రీలు,పియర్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. రక్తప్రసరణ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source:tv9telugu