మీ జుట్టు తొందరగా రాలిపోతుందా? అయితే ఈ మూడు చిట్కాలు మీ కోసమే..

ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు రావడం, జుట్టు రాలడం (hair fall) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం( hair loss) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే(hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు రావడం, జుట్టు రాలడం (hair fall) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు(hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

మొదటి చిట్కా..

గుడ్ల (Eggs)లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి.. గుడ్డు సొన, ఉల్లిపాయ రసాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు (hair)కు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. గుడ్లు, ఉల్లిపాయలు రెండూ జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

రెండో చిట్కా.

జుట్టు పెరుగుదలను (hair growth) పెంచడానికి కొబ్బరి నూనెను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక ఉల్లిపాయ రసం కూడా జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. కొబ్బరి నూనెను కండీషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు.. జుట్టు (hair) దీనిని త్వరగా శోషించుకుంటుంది. అయితే, రెండు చెంచాల ఉల్లిపాయ రసాన్ని, రెండు చెంచాల కొబ్బరి నూనె (Coconut oil)లో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూ (shampoo)తో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మూడో చిట్కా..

ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు అప్లై చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టు మొదళ్లలో ఉండే కొల్లాజెన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. మీ జుట్టు పొడవును బట్టి 3, 4 ఉల్లిపాయలను కోసి వాటిని మెత్తగా రుబ్బి.. రసాన్ని తీయాలి. ఆ రసాన్ని తలకు అప్లై చేసి సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. జుట్టు రాలడం కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డాక్టర్ ని బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source: telugu.news18


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close