ఈ ఫుడ్‌ తింటే.. షుగర్‌ వస్తుంది జాగ్రత్త..!

జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలు. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుని, పొష్టిక ఆహారం తీసుకుని, చెడ్డ ఆహారానికి దూరంగా ఉంటే.. షుగర్‌ వ్యాధికి కొంత దూరంగా ఉండొచ్చు. ఒక్కసారి డయాబెటిస్‌ బారిన పడితే.. జీవితాంతం దానితో తంటాలు పడుతూ ఉండాలి. డయాబెటిస్‌ వచ్చిందంటే రోజూ మందులు వేసుకుంటూనే ఉండాలి. దీని కంటే షుగర్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని ఆహారాలను ఎంత దూరం పెడితే.. డయాబెటిస్‌ మనకు అంత దూరంగా ఉంటుంది.

డయాబెటిస్‌.. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని బాధపెడుతున్న సమస్య. ఒక్కసారి దీని బారినపడితే.. జీవితాంతం దీంతో పోరాటం చేస్తూనే ఉండాలి. దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి నానాతంటాలు పడుతూనే ఉండాలి. నిజానికి షుగర్‌ జీవనశైలి వ్యాధి. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోతే డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని అందరూ భావిస్తారు. కొందరిలో వారసత్వంగానూ.. డయాబెటిస్‌ వస్తుంది.

డయాబెటిస్ వస్తే.. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ హార్మోన్‌ తక్కువగా విడుదల చేస్తుంది, కొన్ని సార్లు హార్మోన్ ఉత్పత్తి మొత్తం నిలిపివేస్తుంది. ఇన్సులిని హార్మోన్‌ రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాస్‌ ఇన్సులిన్‌ విడుదల చేయడంలో విఫలమైనందున.. రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీంతో షుగర్‌ బారినపడిన వ్యక్తికి చెమట, అలసట, బలహీనత, కళ్లతిరగడం, ఎక్కువగా మూత్రం రావడం, గుండె చప్పుడు పెరగడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు.

నిజానికి డయాబెటిస్‌ ఏ కారణంగా వస్తుందో.. డాక్టర్లకూ తెలియదు. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి అతి పెద్ద కారణమని భావిస్తున్నారు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్‌ బారిన పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. ఆ ఆహారాలకు దూరంగా ఉంటే.. డయాబెటిస్‌ నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చంటున్నారు.

పొట్టు తీసేసిన ఆహారం..

వైట్‌ రైస్‌, మైదా, చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు అంటున్నారు. అధికంగా ప్రాసెస్‌ చేసిన కార్బోహైడ్రేట్లు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాసెస్‌ చేస్తే.. దానిలోని పొట్టు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ తొలగుతాయి. ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తింటే.. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం, ఎక్కువ ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు చైనీస్ మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21 శాతం పెంచాయని తేలింది.

షుగర్‌ డ్రింక్స్

చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న డ్రింక్స్‌ తాగినా.. డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. సోడా, తియ్యటి నిమ్మరసం, సాఫ్ట్‌ డ్రింక్స్, ప్రాసెస్డ్‌ జ్యూస్‌లు తాగితే.. టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చక్కెర స్థాయిలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్స్‌ తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. డయాబెటిస్ కేర్‌ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు సార్లు స్వీట్‌ డ్రింక్స్‌ తాగితే.. టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 26 శాతం పెరుగుతుంది.

వేయించిన ఆహారం..

ప్యాకెట్‌ ఆహారం, ఫ్రైలు ఎక్కువగా తీసుకున్న షుగర్‌ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటిలో ఎక్కువగా సంతృప్త కొవ్వు (saturated fats), ట్రాన్స్‌ ప్యాట్‌ ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు (saturated fats), ట్రాన్స్‌ ప్యాట్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ నిలువలు ఎక్కువగా ఉంటే.. టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సంతృప్త కొవ్వు.. వెన్న, క్రీమ్‌ మిల్క్‌, చీజ్‌లలోనూ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తినడం తగ్గిస్తే.. డయాబెటిస్ బెడద నుంచి కొంత తప్పించుకోవచ్చు.

ఉప్పు ఎక్కువ తిన్నా..

సాధారణంగా చక్కెర తింటేనే.. షుగర్‌ వస్తుందని అందరూ అనుకుంటారు. ఉప్పు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతున్నట్టు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలింది. ఒక్క చక్కెరతోనే కాదు.. ఉప్పుతోనూ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనంలో బయటపడింది.

ఉప్పు ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 1.25 స్పూన్ల (సుమారు 2,800 మిల్లీగ్రాములు), అంతకన్నా ఎక్కువగా తీసుకునేవారికి షుగర్ వచ్చే అవకాశం 72% ఎక్కువగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఉప్పు మూలంగా ఇన్సులిన్‌ నిరోధకత (ఇన్సులిన్‌ హార్మోన్‌కు కణాలు అంతగా స్పందించకపోవటం) తలెత్తుతున్నట్టు, ఇది మధుమేహానికి దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. డయాబెటిస్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో డయాబెటాలజిస్ట్ సంప్రదించాలి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source:telugu.samayam


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close