ఉడకబెట్టిన శెనగలతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఉడకబెట్టిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శెనగలని ఉడకబెట్టి తింటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు శనగలను పొట్టు తీయకుండా తింటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. శనగలను మొలకల రూపంలో తిన్నా కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది.

బాదం పప్పులోఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అన్ని ప్రయోజనాలు ఉడికించిన శనగల్లో ఉంటాయి. శనగలను వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శనగల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలస్ట్రాల్  ని తగ్గించటంలో సూపర్ గా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికీ శనగలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. నాన్ వెజ్ లో ఉండే పోషకాలు అన్ని శెనగల్లో ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ తినని వారు శెనగలు తింటే చాలు.

శనగల్లో ప్రోటీన్, ఫైబర్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించేందుకు సహకరిస్తాయి. శనగలు తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. అంతేకాదు, ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. ఇందువల్ల శనగలను మీ డైట్ లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయమేంటంటే శనగలు తీసుకోనివారికంటే.. శనగలు తీసుకున్నవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. సగం కప్పు శనగల్లో 6 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

అంతేకాదు, ఇందులోని ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటి విటమిన్స్ మంచినిద్రను అందిస్తాయి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు శనగలు రెగ్యులర్ గా తినడం మంచిది. పాలు, పెరుగు కి సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. వెజిటేరియన్స్ శనగలని తినడం వల్ల ప్రోటీన్ పొందినవారవుతారు. 100గ్రాముల శనగలను తీసుకోవడం ద్వారా ఏమేం లభిస్తాయంటే.. 164 మిల్లీ గ్రాముల లో కెలరీస్, 8.9 గ్రాముల ప్రోటీన్, 2. 5 గ్రాముల ఫ్యాట్, ఫైబర్ 8.6 గ్రాముల ఫైబర్, ఐరన్ 2.8 గ్రాములు ఉంటుంది. కనుక శనగలే కదా అని తీసేయకుండా మీ ఆహారంలో వీటిని చేర్చుకొని ఎన్నో లాభాలు పొందండని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి. Salaha.in లో కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source: tv9telugu


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close