మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఉద్యోగం చేసే మహిళలైతే మరింత జాగ్రత్త అవసరం. ఆ సమయంలో ఉద్యోగం చేయటం అంత సులభం కాదు. శరీరంలో వచ్చే మార్పులు వస్తుంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి.. ఎలా హెల్దీగా ఉండాలో తెలుసుకోండి.
మహిళలు గర్భ సమయంలో జాబ్ చేయవచ్చు. కానీ, ఆ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉంటూనే, ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. అప్పుడు వచ్చే అసౌకర్యాలని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.
వికారాన్ని, వాంతులని తగ్గించుకోవటం..
ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉదయం వికారంగా ఉంటుంది. ఎక్కువమంది మహిళల్లో ఉదయం వికారంగా ఉంటుంది. కొంతమందికి రోజంతా ఉంటుంది. ఇది తర్వగా తగ్గాలంటే..కొన్ని చిట్కాలు పాటించండి.
వికారం తెప్పించే పదార్థాలకి దూరంగా ఉండండి..
ఈ సమయంలో మహిళలకు చాలా ఇష్టమైన పదార్థాలపైనా కూడా ఒక్కోసారి వికారం పుట్టొచ్చు. వాటిని ఇంతకుముందు ఎంతో ఇష్టంగా తీసుకున్నా.. ఇప్పుడు వాటిపై వికారంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చిరుతిళ్లు తినండి. క్రాకర్ బిస్కెట్లు ఇంకా ఇతర మెత్తని ఆహారం తినటం మీకు చాలా మంచిది. ఆఫీసులో సులభంగా తినటానికి చిరుతిళ్ళను ముందు నుండే పెట్టి ఉంచుకోండి. అల్లం టీ వికారాన్ని తగ్గిస్తుంది.
అలసటగా ఉంటే..
గర్భ సమయంలో మీకు త్వరగా అలసట అనిపిస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవటం కష్టం కాబట్టి..ఐరన్, ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఐరన్ లోపంతో అలసట వస్తుంది. అదేవిధంగా రక్తహీనత కూడా మరో లక్షణం. వీటిని తగ్గించుకునేందుకు మీరు మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎర్రని మాంసం, గుడ్లు, సీ ఫుడ్, ఆకుకూరలు, ఐరన్ ఉండే ధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోండి.
తరచు విశ్రాంతి తీసుకోవడం: కుర్చీలో ఎప్పటికీ కూర్చోకుండా అప్పుడప్పుడు లేవాలి. లేచి నిలబడి కాసేపు అటూ ఇటూ తిరగడం వలన మీకు ఓపిక వస్తుంది. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకోవటం, పాదాలను కాస్తా ఎత్తులో పెట్టుకోవటం వల్ల అలసట తగ్గి ఉత్సాహం వస్తుంది.
ద్రవపదార్థాలు తీసుకోవడం: ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం మంచిది. అందుకే.. మీ డెస్క్, పనిచేసేచోట ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని మధ్య మధ్యలో తాగండి. ఇవే కాకుండా కొబ్బరి నీళ్లు, జ్యూసెస్, మజ్జిగ తీసుకోవడం మంచిది. అయితే, అన్ని పండ్లని జ్యూస్‌గా తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
కొన్ని పనులను వాయిదా వేయండి: కొన్ని పనులను తగ్గించుకోవటం వల్ల మీకు ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది. అంటే నేరుగా షాపింగ్ చేయకుండా..ఆన్లైన్‌లో చేయొచ్చు. ఇంటి పనులు, తోట పనులు ఇలాంటి వాటి కోసం సాయం తీసుకోవడం చేయొచ్చు.
వ్యాయామ రొటీన్ ని పాటించండి : ప్రెగ్నెన్సీ సమయంలో కొంత వర్కవుట్ చేయడం మంచిది. అయితే, ఉద్యోగినులకు అంత టైమ్ ఉండకపోవచ్చు. రోజంతా పనిచేశాక..వర్కవుట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. అయితే, శారీరక వ్యాయామం వల్ల మీ ఒంట్లో ఓపిక పెరుగుతుంది – ముఖ్యంగా రోజంతా డెస్క్ వద్ద కూచునే వుండేవారికి మరింత ముఖ్యం. ఆఫీసు అనంతరం నడుస్తూ వెళ్లండి. అదే విధంగా.. వైద్యుల సలహా మేరకు కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం లేదా ఫిట్‌నెస్ క్లాసులో చేరడం వంటివి చేయండి.
సరైన నిద్ర : గర్భిణీలకు విశ్రాంతి ఎక్కువ అవసరం. మామూలు సమయాల్లో 8 గంటలు నిద్రపోతే.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కనీసం 10గంటల పాటు నిద్ర ముఖ్యమని తెలుసుకోండి. అయితే, ఈ సమయంలో పడుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎడమవైపుకి తిరిగి పడుకోటం వల్ల బేబీకి ఎక్కువగా రక్తప్రసరణ జరిగి, వాపులకి ఉపశమనం లభిస్తుంది. ఇంకా సౌకర్యంగా ఉండటానికి పొట్ట కింద అలాగే కాళ్ళ మధ్యన దిండ్లు పెట్టుకుంటే బరువు అంతగా అన్పించదు.
సౌకర్యంగా ఉండటం
నెలలు నిండుతున్న కొద్దీ, రోజువారీ చేసే పనులు, అంటే కూచోడం, నిల్చోడంలాంటివి కూడా అసౌకర్యంగా అన్పించవచ్చు. అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. గంటకోసారి అటూ ఇటూ తిరగటం వల్ల కండరాలు వదులుగా మారి, మీ కాళ్ళు,పాదాలలో ఫ్లూయిడ్ పెరిగి వాపులు తగ్గుతాయి.
కూర్చోవడం : ఎక్కువ సమయం సౌకర్యంగా కూర్చోడానికి వీలుగా నడుముకి సపోర్ట్ ఇచ్చే అడ్జస్టబుల్ చైర్స్‌ని వాడండి. ముఖ్యంగా మీ బరువు, భంగిమ మారతాయి కాబట్టి ఇది అవసరమని గుర్తుంచుకోండి. మీ కుర్చీ అడ్జస్టబుల్ కాకపోతే, నడుము వద్ద చిన్న దిండు లేదా కుషన్ ని పెట్టుకోండి. వాపులు తగ్గడానికి కాళ్ళని ఎత్తు మీద పెట్టండి.
నిలబడటం: మీరు ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తే, ఒక పాదాన్ని చిన్న స్టూలు లేదా డబ్బా, ఫుట్ రెస్ట్ మీద పెట్టి నిల్చోండి. పాదాలను మారుస్తూ ఉండండి. తరచుగా విశ్రాంతి తీసుకోండి. సౌకర్యవంతమైన, పాదానికి మంచి ఒత్తుగా ఉండే షూని ధరించండి.
వంగటం, బరువులు ఎత్తడం : తేలికైనది బరువు ఎత్తుతున్నప్పుడు మీకు అసౌకర్యంగా ఉండొచ్చు. అప్పుడు నడుము దగ్గర వంగకుండా, మోకాళ్ళని వంచి వంగండి. కాళ్ళ మీద భారం వేస్తూ బరువులు ఎత్తండి – నడుము మీద బరువు వేయొద్దు. బరువులు ఎత్తేటప్పుడు శరీరాన్ని సడెన్ గా తిప్పవద్దు.
ఆఫీసులో ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..
పనులపై నియంత్రణ ఇలా : రోజువారీ చేయాల్సిన పనుల లిస్టు తయారుచేసుకుని వాటి ప్రాముఖ్యతని బట్టి ఏది ముందో ఏది తర్వాతో తేల్చుకోండి. ఇంకొకరికి ఏవి అప్పగించొచ్చు. అసలు చేయకుండా వదిలేసేవి ఏమిటో గుర్తించండి.
బయటకి మాట్లాడండి : మీకు అండగా నిలిచే సహోద్యోగి, స్నేహితులు లేదా ప్రేమించేవారితో మీ చిరాకుల గురించి మనస్సు విప్పి మాట్లాడండి.
విశ్రాంతి : నెమ్మదిగా శ్వాస పీల్చడం, మీరొక ప్రశాంతమైన చోట ఉన్నట్టు ఊహించుకోవడం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీసు చేయండి. మీ డాక్టరుకి అభ్యంతరం లేనంతవరకూ డెలివరీకి ముందు జరిగే ప్రీనేటల్ యోగా క్లాసులో చేరండి.
ఉద్యోగానికి సంబంధించిన ముందు జాగ్రత్తలు పాటించడం పనిచేసేచోట కొన్ని పరిస్థితులు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సమస్యలని పెంచే రిస్క్ ఉంది. దీనివల్ల మీకు ముందుగానే డెలీవరీ అవకాశాలు ఉంటాయి. అవి ఏంటంటే..
*హానికర పదార్థాల బారిన పడటం
*చాలా ఎక్కువ సమయం నిల్చోవాల్సి రావటం
*భారీ బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, మోసుకురావాల్సి రావడం
*ఎక్కువగా అరుపులు, శబ్దాలు చేయటం
*పెద్ద పెద్ద మెషీన్ల వంటి వాటి నుండి ఎక్కువ కదలికలు,కంపనాలు వచ్చేటప్పుడు చుట్టూ పక్కల ఉండడం
*తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా డెలీవరి ముందే కావొచ్చు.
గమనిక: పైన పేర్కొన్న సూచనలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు. ప్రెగ్నెన్సీ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సలహాలో గైనకాలజిస్ట్ను బుక్ చేయండి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source: telugu.samayam