పొలం పనులు చేసుకునే రైతులు.., బరువులు మోసే కూలీలు.. ఇంతకుముందైతే నడుంనొప్పికి కేరాఫ్ అడ్రస్‌లు వీళ్లు. ఇప్పుడు మాత్రం నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు.
ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ఎక్కువ మంది భుజాలు జార్చి కూర్చుంటుంటారు. కాని కూర్చున్నా, నిల్చున్నా వెన్ను నిటారుగా ఉంచాలి. ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే వెనకాల సపోర్టు ఉండాలి. గంటకోసారి లేచి, అటూ ఇటూ నడవాలి. లేకుంటే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. యువతలో జీవనశైలి కారణమైతే చిన్న పిల్లల్లో కూడా నడుము నొప్పి రావడానికి కారణం మాత్రం స్కూల్ బ్యాగులే. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఎముక సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు రావొచ్చు. సాధారనంగా స్పైన్ ఫ్యూజన్స్ ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తాయి.
ఇక వయసు పెరిగిన వాళ్లలో ముఖ్యంగా ఆడవాళ్లలో కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరొసిస్ సమస్య వస్తుంది. దీనివల్ల ఎముకలు అరిగిపోతాయి. ఎముకలు అరిగిపోవడం వల్ల నడుము నొప్పి, కీళ్లనొప్పులు సర్వసాధారణం. మెనోపాజ్ దాటినవాళ్లలో ఈ నొప్పులు సాధారణంగా కనిపిస్తాయి. గుంతల రోడ్లు, ైస్టెల్‌గా ముందుకు వంగి నడపాల్సిన బండ్లు కూడా డిస్క్ సమస్యలను తెస్తున్నాయి.
లక్షణాలు:
నడుమునొప్పి వస్తూ పోతూ ఉంటుంది. కూర్చున్నప్పుడు, పనిచేసేటప్పుడు నొప్పి లేస్తుంది. మొదటి దశలో ఇలా నొప్పి వచ్చిపోవడానికి కారణం నడుము కండరాలు బలహీనంగా ఉండడం. ఎముక, కండరాలపై బరువు సమానంగా పడాలి. లేకపోతే నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు మూడు నాలుగు రోజులు మందులు వాడి, వ్యాయామం చేస్తే తగ్గుతుంది. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. – కూర్చుని లేచేటప్పుడు, ఎక్కువ సేపు నడిచినప్పుడు, ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు నొప్పి ఉంటుంది. మొదట్లో నొప్పి వస్తూ తగ్గుతూ ఉంటుంది. ఆ తరువాత ఎప్పటికీ నొప్పి ఉంటూనే ఉంటుంది. నొప్పి తీవ్రత పెరుగుతుంది. దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే సయాటికా నొప్పిగా మారుతుంది.
కండరం పట్టేయడం (మజిల్ స్పాజ్మ్) వల్ల నొప్పి తీవ్రంగా ఉంటుంది. కండరం పట్టేయడానికి రెండు కారణాలుంటాయి. నడుము కండరం సంకోచించి అలాగే ఉండిపోవడం ఒక కారణం. పడుకున్నప్పుడు ఇది కొంచె రిలాక్స్ అవుతుంది. అందువల్ల రెస్ట్‌లో నొప్పి తగ్గుతుంది. ఇలాంటప్పుడు ఏ పనిచేసినా, నిల్చున్నా, నడిచినా నొప్పే ఉంటుంది. పడుకుంటే మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు కూడా మూడు నాలుగు రోజులు మందులు వాడి, ఫిజియోథెరపీ చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇకపోతే డిస్క్ చిరిగిపోయి దాని నుంచి రసాయనాలు విడుదలవడం వల్ల కూడా మజిల్ స్పాజ్మ్ అవుతుంది.
చివరగా నడుము నుంచి నొప్పి కాళ్లకు పాకుతుంది. దీన్ని Sayatika అంటారు. చినిగిన డిస్క్ పక్కనున్న కాలుకు వెళ్లే Sayatika నరంపై ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే నడుములో మొదలైన నొప్పి కాలుకు పాకుతుంది. ఇందుకు మరో కారణం Radikyulaitis – రసాయనాలు నరం మూలాన్ని ఇరిటేట్ చేసి నొప్పి కలిగిస్తాయి. దాంతో ఇది కాలికి పాకుతుంది. Sayatika ఉన్నవాళ్లకు రెడ్ ఫ్లాగ్ సంకేతాలు కనిపిస్తే ఎంఆర్‌ఐ చేసి వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది.
గమనిక: పైన పేర్కొన్న సూచనలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు. ఎముకలుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో ఆర్థోపెడిక్ను సంప్రదించాలి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.
Source: yashoda