డయాబెటిస్ రోగులు రోజూ ఈ ఆహార పదార్థాలను తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్‏లో ఉంటాయట..

డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలో… తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారు రోజూవారీ డైట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.

వీరు రోజువారీ భోజనంలో అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవారు అన్నిరకాల పండ్లు, కూరగాయలు తినకూడదు. తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే డయాబెటిస్ రోగులు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అవెంటో తెలుసుకుందాం.

దుంపలు

బీట్‏రూట్‏లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డయబెటిస్ నియంత్రణకు సహయపడుతాయి. అలాగే ఇందులో ఉండే సహజ చక్కెర శరీరంలో త్వరగా గ్లోకోజ్ మార్చబడదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. బీట్‌రూట్‌లో లిపోయిక్ ఆమ్లం అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ కణాలను వృద్ధాప్యం వలన కలిగే సమస్యలను తగ్గిస్తుంది.

టమోటాలు

 లైకోపీన్ అధికంగా ఉండే టమోటాలు గుండెకు చాలా మంచిది. ఇవి రక్తపోటు, డయాబెటిస్‌ ఉన్నవారికి కలిగే గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అవి కార్బ్‌లో తక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ ఉన్నవారికి మంచిది.

 అవిసె గింజలు అవిసె గింజలో లిగ్నన్స్ అనే కరగని ఫైబర్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా.. డయాబెటిస్ ఉన్నవారికి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన గట్, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

విత్తనాలు

 మిక్స్ గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోరు కలిగి ఉంటాయి. ముఖ్యమైన నూనెలు, గింజల మొత్తం పోషక విలువలు డయాబెటిస్ మంట, రక్తంలో చక్కెర, ఎల్‌డిఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కొన్ని విత్తనాలు లేదా సుమారు 30 గ్రాముల గింజలు తినడం ఆరోగ్యానికి మంచిది. గింజలు పిండి పదార్థాలకు మంచి ప్రత్యామ్నాయం.

గుమ్మడికాయ విత్తనాలు

కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాన్ని తినాలనే తినాలనిపించే డయాబెటిస్ రోగులు రోజూ కొన్ని గుమ్మడికాయ గింజలు తినడం మంచిది. ఇందులో ఐరన్, అసంతృప్త కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఆకలిని నియంత్రిస్తాయి.

తృణధాన్యాలు

బార్లీ, వోట్స్ వంటి తృణధాన్యాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలలో అకస్మాత్తుగా వచ్చే సమస్యలను నివారిస్తాయి. తృణధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడాన్ని కూడా నివారించడంలో సహాయపడుతాయి. ఇది డయాబెటిస్‌కు ప్రధాన ప్రమాద కారకం. అవి బి విటమిన్లు, ఇనుము, ఖనిజాల అద్భుతమైన వనరులు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి ఇవి సహాయపడతాయి.

బెర్రీలు 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ సూపర్ పండ్లలో జమున్ ఒకటి. జామున్ వినియోగం ఇన్సులిన్ , సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో జమున్ జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. జమున్ సీడ్ పౌడర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. జమున్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ పిండి పదార్ధాలను శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది.

మెంతి 

మెంతి గింజలు, మెంతి ఆకులు రెండూ మధుమేహానికి సూపర్ ఫుడ్స్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరల శోషణను నియంత్రిస్తుంది. ఇవి గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. మెంతి గింజలను రాత్రిపూట నానబెటి తీసుకోవాలి. అలాగే ‘మెంతి నీరు’ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

జామ కాయ

ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే మధుమేహ వ్యాధి ఉన్నవారికి చికిత్స చేసేందుకు సహాయపడే డైటరీ ఫబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శోషణను నియంత్రిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న సూచనలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు. డయాబెటిస్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా డయాబెటాలజిస్ట్ సంప్రదించాలి. డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source:tv9telugu

Download App

Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close