దంతాలతో జాగ్రత్త.. రోజూ ఇలా చేస్తే సమస్యలు దూరం

దంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. లేకపోతే.. డయాబెటీస్, గుండె సమస్యలు వస్తాయని నిపుణులు...

మీకు తెలుసా? దంతాలు శుభ్రంగా లేకపోతే ఆరోగ్యం చెడిపోతుందని? చిగుళ్ల నుంచి కారే రక్తం ఇన్ఫెక్షన్‌కు దారి తీయొచ్చు. అది రక్తం నుంచి నేరుగా గుండె, మెదడకు చేరి ఆరోగ్యం క్షీణించవచ్చు. దంతాలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. పెద్ద నష్టమే జరగొచ్చు. చిగుళ్ల వ్యాధికి హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు సంబంధం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి.. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూసేయండి మరి.

❂ పళ్లు తోముకోవడానికి సరైన టూత్ బ్రష్‌ను ఎంపిక చేసుకోండి.
❂ చిన్నపిల్లల్లో పాలదంతాలు ఉంటాయి. కాబట్టి వారికి పెద్దలు ఉపయోగించే బ్రష్ వాడకూడదు.
❂ నోట్లోని అన్ని మూలలకు చేరేలా ఉండే ఫ్లెక్సిబుల్‌ బ్రష్‌ను మాత్రమే వాడాలి.
❂ టూత్ పేస్ట్‌ను కొద్దిగానే వాడాలి.
❂ పిల్లలకు కూడా కొద్దిగానే టూత్ పేస్ట్ ఇవ్వాలి. వారు పేస్ట్ మింగకుండా చూడాలి.
❂ చల్లని, వేడి పదార్థాలు తినేటప్పుడు దంతాలు ఝుమ్మని లాగుతున్నట్లయితే యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్టులు వాడటం ఉత్తమం.
❂ దంతాలు తెల్లగా మెరవడం కోసం ఏది పడితే అది వాడొద్దు. డెంటిస్ట్‌లు సూచించే పేస్టే వాడండి.
❂ రోజూ రెండు సార్లు, రెండు నిమిషాల చొప్పున బ్రష్ చేసుకోవాలి.
❂ చిగుళ్లకు 45 డిగ్రీల కోణంలో బ్రష్‌ను మృదువుగా ముందుకు వెనక్కి కదపాలి.
❂ దంతాల బయటివైపు, లోపల, నమిలే భాగాల్లో బాగా బ్రష్ చేయాలి.
❂ ముందు పళ్లు, లోపలి వైపు క్లీన్ చేయడం కోసం బ్రష్‌ను నిలువుగా ఉంచి, కిందకు మీదకు కదల్చండి.
❂ ప్రతి 3 లేదా 4 నెలలకు బ్రష్ మార్చాలి.
❂ గాలి తగిలేలా బ్రష్‌ను నిలువుగా ఉంచాలి.
❂ నాలుకను శుభ్రం చేయడం వల్ల దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించవచ్చు. నోటి దుర్వాసన అరికట్టవచ్చు.
❂ నాలుగు శుభ్రంగా ఉంటేనే ఆహారం రుచి సరిగ్గా తెలుస్తుంది. కాబట్టి.. టంగ్ క్లీన్ తప్పనిసరి.
❂ దంతాల మధ్య ఏదైనా ఇరుక్కుంటే వెంటనే తొలగించాలి. ఇందుకు స్ట్రింగ్ ఫ్లాస్, టైనీ బ్రష్‌లను వాడొచ్చు.
❂ ఫ్లాసింగ్ చేయడం వల్ల పంటి గార, దంతాల మధ్య ఇరుకున్న ఆహారాన్ని తొలగించవచ్చు.
❂ పంటిగార దంత క్షయానికి దారి తీస్తుంది. చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. కాబట్టి తరచుగా ఫ్లాసింగ్ చేయడం తప్పనిసరి.
❂ వాటర్ పిక్ పరికరంతో దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తేలిగ్గా బయటకు తీసేయొచ్చు.
❂ వాటర్ పిక్ విధానం చిగుళ్ల నుంచి రక్తస్రావం కాకుండా చూస్తుంది.

మౌత్ వాష్‌తో...:
❂ నోట్లో టూత్ బ్రష్ వెళ్లలేని ప్రాంతాలను శుభ్రం చేయడానికి మౌత్ వాష్ ఉపయోగపడుతుంది.
❂ మౌత్ వాష్‌లు రెండు రకాలు. వాటిని కాస్మోటిక్, థెరపెటిక్ కాస్మోటిక్‌గా విభజించారు.
❂ నోటి దుర్వాసనను అప్పటికప్పుడు పోగొట్టేందుకు, చిగురు వాపును పొగొట్టేందుకు థెరపిక్ మౌత్ వాష్‌ వాడటం మంచిది. ఇవి పంటి గార, దంత క్షయాన్ని కూడా అరికడతాయి.

వీటికి దూరంగా ఉండండి:
❂ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. షుగర్ క్యాండీలు, ఐస్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
❂ కాఫీలు, పుల్లటి సిట్రస్ డ్రింకులు కూడా దంతాలకు ప్రమాదకరమే. వాటిని తాగిన తర్వాత నీటిని నోటిలో వేసుకుని పుక్కిలించి ఉసేయడం మంచిది.
❂ నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించండి.

వీటిని తీసుకోవడం మంచిది:
❂ కాల్షియం అధికంగా ఉండే చీజ్, పెరుగు లాంటి ఆహారం దంతాలకు మంచిది.
❂ ఆపిల్, బాదం, ఆకుకూరలు కూడా దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
❂ ఆహారం తిన్న వెంటనే నోటిని పుక్కిలించడం మంచి అలవాటు.
❂ వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం మంచిది.

గమనిక: పైన పేర్కొన్న సూచనలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు. దంతాల బలహీనతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా  Salaha.in లో  డెంటిస్టూ సంప్రదించాలి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source: Times of India


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close