ప్రతిరోజూ ఉదయం 10 గంటల్లోపు ఇలా చేస్తే చాలా మంచిదట

ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అది కఫ సమయం అని అంటున్నారు. అప్పుడు నీళ్ళు మరియు భూమి ఎనర్జీని రూల్ చేస్తాయి కాబట్టి ఇటువంటి సమయంలో వ్యతిరేకంగా వెళ్లి బాలన్స్‌గా ఉండాలని చెబుతున్నారు.

తొలగించండి:

చెడు మలినాలని తొలగించడం మంచిది. ముఖ్యంగా బౌల్స్, బ్లాడర్‌తో పాటుగా చెవులు, ముక్కు, నోరు కూడా.

నాలుక గీసుకోవడానికి:

నెమ్మదిగా నాలుక మీద ఉండే పాచి వంటి వాటిని తొలగించాలి. దీనితో నాలుగు శుభ్రంగా ఉంటుంది. పింక్ కలర్‌లో ఉండే టిష్యూస్ ని ముకోస అంటారు ఆయిల్ పుల్లింగ్ ద్వారా కూడా వీటిని తొలగించొచ్చు.

సెల్ఫ్ మసాజ్:

ప్రతి రోజు కూడా మసాజ్ చాలా ముఖ్యమని ఈమె అంటున్నారు. దీని కోసం ధర ఎక్కువైన నూనెను వాడాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్తున్నారు. ఆయిల్ మసాజ్ కానీ డ్రై బాడీ బ్రషింగ్ కానీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. వీటిని పాటించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని తెలియజేయడం జరిగింది. అదే విధంగా గాయాల్ని రాకుండా చూసుకుంటుంది.

కదలిక :

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించాలి అని అంటున్నారు. మీకు నచ్చిన ఏ వ్యాయామమైనా చేయొచ్చు అని చెబుతున్నారు. ఏ వ్యాయామం చేసినా మజిల్స్ బాగుంటాయని సూర్య నమస్కారాలు అయితే మరీ మంచిదని అంటున్నారు. కనుక రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు లేదా ఏమైనా వ్యాయామాలు చేయండి దీనితో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

శ్వాస తీసుకోండి, మెడిటేషన్ చేయండి:

శ్వాస ప్రక్రియలు లేదా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా మానసిక సమస్యలు ఏవీ ఉండవు. యోగా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు అనుసరించవచ్చు. దీంతో ఆరోగ్యం మరింత బాగుంటుంది. కనుక రెగ్యులర్‌గా ఈ పద్ధతులను కూడా అనుసరించండి.

హెర్బల్ టీ:

సాధారణ టీ కంటే కూడా హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒంట్లో ఉండే చెడు మలినాలని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే లెమన్ టీ, అల్లం టీ లేదా ఇతర ఏ హెర్బల్ టీ అయినా తీసుకోవచ్చు. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పైగా చెడు మలినాలు కూడా తొలగిపోతాయి.

రెగ్యులర్‌గా ఈ చిట్కాలను కనుక పాటించాలంటే ఆరోగ్యం బాగుంటుంది. పైగా ఒంట్లో ఉండే చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఈ పద్ధతులని కనుక ప్రతీ రోజూ పాటించారంటే శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది. ఫిట్‌గా ఉండడానికి కూడా వీలవుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా మీరు చెక్ పెట్టొచ్చు. అదే విధంగా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close